Header Banner

నేలకేసి కొట్టి.. మోకాలితో తొక్కిపెట్టి.. ఆస్ట్రేలియా పోలీసుల కర్కశం! భారత సంతతి వ్యక్తి మృతి!

  Sun Jun 15, 2025 22:35        Australia

ఆస్ట్రేలియాలోని అడిలైడ్లో భారత సంతతికి చెందిన గౌరవ్ కుండి (Gaurav Kundi) అనే యువకుడిపై అక్కడి పోలీసులు ఇటీవల కర్కశంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలైన గౌరవ్.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అడిలైడ్లో ఉండే గౌరవ్ కుండి, అమృత్పాల్ కౌర్ దంపతుల మధ్య ఇటీవల చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది. అది గమనించిన పెట్రోలింగ్ పోలీసులు.. గృహ హింసగా భావించారు. అనంతరం ఇంట్లోకి వచ్చి గౌరవ్ను అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించారు. అయితే, తమ మధ్య ఎలాంటి గొడవ లేదని, కేవలం చిన్న వాగ్వాదమేనని అతడి భార్య అమృత్పాల్ వారించినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. తాను ఎలాంటి నేరం చేయలేదని గౌరవ్ ఎంత వేడుకున్నా కనికరించలేదు. అతడిని బలవంతంగా నేలపై పడేసి అరెస్టు చేసేందుకు యత్నించారు.

 

ఇది కూడా చదవండి: ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

 

ఈ ఘటనను అమృత్పాల్ తన కెమెరాలో చిత్రీకరించడంతో పోలీసుల కర్కశత్వం బయటపడింది. అయితే, కిందపడిన తన భర్త మెడను ఓ పోలీసు అధికారి మోకాలితో గట్టిగా అదిమి పట్టాడని, అరెస్టు సమయంలో తల నేలకు, పోలీసు వాహనానికి బలంగా తాకడంతో గౌరవ్ అక్కడే స్పృహ కోల్పోయాడని అమృత్పాల్ ఆరోపించారు. ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అతడి మెదడు, మెడ నరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలని అమృత్పాల్ వేడుకున్నారు. ఈ చర్య 2020లో అమెరికాలో జరిగిన ఆఫ్రో- అమెరికన్ జార్జి ప్లాయిడ్ ఉదంతాన్ని తలపించిందని స్థానిక మీడియా పేర్కొంది.

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

అసైన్డ్‌ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!

 

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

 

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!

 

విజయ్ మాల్యా: అసలు సరే వడ్డీ, జరిమానాలు ఎవరు కడతారు? ఎవరైనా క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక చేతులెత్తేస్తే!

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

24 గంటలు టైమిస్తున్నా.. లేదంటే తీవ్ర చర్యలు.. వైసీపీకి లోకేశ్‌ హెచ్చరిక!

 

తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ని అడ్డుకున్న పోలీసులు! కార్యకర్తలు సుమారు 300 మంది!

 

వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...

 

మహిళలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ కింద లక్ష రూపాయలు! ప్రభుత్వం కీలక నిర్ణయం..

 

ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్: 10వ తరగతి పాస్ అయితే చాలు.. ఉచిత ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగ అవకాశం!

 

ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..

 

ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!

 

రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!

 

ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Gaurav Kundi #Australia police #Indian origin #Police brutality #Amritpal Kaur #South Australia #Custodial death #Family dispute #Brain injury #Grant Stevens